24 నుండి నాటిక పోటీలు

ప్రజాశక్తి – వీరవాసరం

ఈ నెల 24 నుండి వీరవాసరం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో అఖిలభారతస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్‌ అధ్యక్షుడు గుండా రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిక పోటీలు కరోనా, ఇతర కారణాల వల్ల కొన్ని సంవత్సరాలుగా నిర్వహించలేకపోయామన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల పోటీలను కొనసాగించాలని కళాపరిషత్‌ కార్యవర్గం నిర్ణయించిందన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ పోటీల్లో ఎనిమిది నాటికలు ప్రదర్శించడంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులను, విద్యావేత్తలను, ఇతర రంగాల ప్రముఖులను, కళాకారులను సత్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాలా ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు ఆకుల లీలాకృష్ణ, గుండా మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️