నరసాపురం : మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం 7 ఆంధ్ర నేవల్ నరసాపురం యూనిట్ ఆధ్వర్యంలో ఎన్‌సిసి క్యాంప్ ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను క్యాంప్ యూనిట్ కమాండర్ కెప్టెన్ వై.ప్రదీప్, డిప్యూటీ క్యాంప్ కమాండర్ లెఫ్టినెంట్ సంజీత్ రౌత్రే ప్రారంభించారు. ఈ క్యాంపుకు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన 200 మంది ఎన్‌సిసి క్యాండిడ్స్ హాజరయ్యారు. డిసెంబర్ 7 వరకు క్యాంపు కొనసాగుతుందని క్యాంప్ కమాండర్ ప్రదీప్ తెలియజేశారు.