ప్రజాశక్తి – భీమవరం
తాము అధికారంలోకి వస్తే ఎటువంటి విద్యుత్ భారాలు మోపబోమని చెప్పిన కూటమి అధికారంలోకి రాగానే మోయలేని విధంగా భారాలు మోపడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్ విమర్శించారు. ప్రజలపై భారాలు వేయడమే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యాన పట్టణంలో మారుతీనగర్, మెంటేవారితోటల్లో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ భోగి మంటలు అంటే పాత వస్తువులను మంటల్లో వేయడం ఆచారంగా వస్తుందన్నారు. ప్రభుత్వం గతంలో వినియోగించుకున్న దానికి ప్రస్తుతం బిల్లుల వసూలు చేసే ప్రయత్నం ఏదైతో ఉందో దాన్ని భోగి మంటల్లో వేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను గాలికొదిలేసి డిస్కమ్‌లు పెట్టే తప్పుడు ప్రతిపాదనలను నియంత్రణా మండలిగాని, రాష్ట్ర ప్రభుత్వంగాని ఆమోదించడమంటే పాలకులు ఎవరి పక్షాన ఉన్నారో తెలుస్తుందన్నారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, నాయకులు ఆకుల హరేరాం, మల్లిపూడి ఆంజనేయులు, జి.రఫాయేలు, కె.రత్నకుమారి, ఎం.లత పాల్గొన్నారు. పాలకోడేరు: అడ్డగోలుగా విద్యుత్ ఒప్పందాలను చేసుకుని అవినీతికి పాల్పడి దానిని కప్పి పుచ్చుకునేందుకు ప్రజలపై భారాలను మోపడం సరైంది కాదని, తక్షణం విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. విస్సాకోడేరులో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్ వేసి పేదల నెత్తిన భారాలు మోపుతుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని భారాలు వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయన్నారు. వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే భవిష్యత్తులో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శేషాపు అశ్రియ్య, నాయకులు కలిదిండి గోపాలరాజు, పృథ్వీరాజు, సత్యనారాయణ, స్థానికులు పాల్గొన్నారు. వీరవాసరం: విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి ప్రజలపై విద్యుత్ భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన సోమవారం నిరసన తెలిపారు. పెర్కిపాలెం, వీరవాసరం, మత్స్యపురి, ఉత్తరపాలెం గ్రామాల్లో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో సిపిఎం సీనియర్ నేత జుత్తిగ నరసింహమూర్తి, మండల కార్యదర్శి బొర్రా అలమహారాజు, నేతలు బాలం విజయకుమార్, యండమూరి సుబ్బారావు, రెడ్డి రామారావు, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, ప్రజలు పాల్గొన్నారు. పెనుమంట్ర: విద్యుత్ భారాలను వెంటనే ఉపసంహరించాలని సిపిఎం మండల కార్యదర్శి కోడి శ్రీనివాస ప్రసాద్ అన్నారు. బ్రాహ్మణచెరువులో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేశారు. కార్యక్రమంలో నేతలు చింతపల్లి లక్ష్మికుమారి, మాదాసు లక్ష్మణరావు, వి.భాస్కరరావు, కముజు కృష్ణ, శీలం శ్రీను, రొక్కాల శ్రీను, చిన్నబ్బులు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆచంట: విద్యుత్ భారాలను ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి పి.మోహన్‌రావు మాట్లాడగా నేతలు కుసుమే జయరాజు, తలుపూరి బుల్లబ్బాయి, బండి రంగారావు, నెక్కంటి కృష్ణమూర్తి, నెక్కంటి వీరబ్రహ్మం, సత్యనారాయణ, రాంబాబు పాల్గొన్నారు. ఆకివీడు: విద్యుత్ భారాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. బొక్కా వారి వీధి, సావిత్రమ్మ వీధి, రైల్వే స్టేషన్ వద్ద ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాల్లో బొక్కా సత్యనారాయణ, పెంకి అప్పారావు, రాంబాబు, డొక్కా రవి తదితరులు పాల్గొన్నారు. కాళ్ల: విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన మండలంలోని కాళ్ల, జువ్వలపాలెం, ఎల్‌ఎన్‌పురం, గోగుతిప్ప, ప్రాతాళ్లమెరక గ్రామాల్లో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడగా నేతలు మండా సూరిబాబు, తిరుమాని శ్రీను, తానుకొండ వెంకటేశ్వరరావు, నాగిడి ఆంజనేయులు, గండికోట వెంకటేశ్వరరావు, ప్రజలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: తాము అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని, స్మార్ట్ మీటర్లు, సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు విమర్శించారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం రద్దు చేయాల్సిందిపోయి అదే ఒప్పందాన్ని తిరిగి అమలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. విద్యుత్ భారాలను ఉపసంహరించని పక్షంలో దశలవారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, నేతలు జవ్వాది శ్రీను, దేశంశెట్టి సతీష్, పుట్టా ఏసు, కాయల ప్రసాద్, మద్దూరి ఆనంద్, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం అంబేద్కర్, బాబూజగజీవన్‌రావ్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో భోగిమంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడగా విజయ, అనూష, రమేష్, జయ, రాహేలమ్మ, కుమారి, ధనమ్మ, సూర్యచంద్రం పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం: విద్యుత్ భారాలు ఉపసంహరించాలని కోరుతూ కేశవరంలోని ఉద్దరాజు రామం నగర్‌లో సిపిఎం ఆధ్వర్యాన భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ స్మార్ట్‌మీటర్లు, సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే 2000వ సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం పునరావృతమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి పెచ్చెట్టి నరసింహమూర్తి మాట్లాడగా పెచ్చెట్టి లక్ష్మి, కట్టా సత్యవతి, కోడి సత్యనారాయణ, వీరవల్లి గంగారత్నం తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ: సిపిఎం ఆధ్వర్యాన మండలంలో పెనుగొండ, వడలి, సిద్ధాంతం, చినమల్లం, తామరాడ, సోమరాజు చెరువు గ్రామాలు, సిద్ధాంతం కరెంట్ ఆఫీస్ కాలనీలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి షేక్ పాదుషా మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.వెంకటేశ్వరరావు, పద్మ తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి: ట్రూఅప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ మండలంలోని చించినాడ, కలగంపూడి, ఏనుగువానిలంక, యలమంచిలి, కట్టుపాలెం, దొడ్డిపట్ల, గుంపర్రు తదితర గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యాన భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు, నేతలు బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్, పల్లి జార్జిబాబు, శెట్టిమి భాస్కర్‌రావు, ముస్కూడి జయశ్రీ, శెట్టిమి నాగమణి, మల్లుల పుల్లారావు, చింతపల్లి కొండ పాల్గొన్నారు. భీమవరం టౌన్: రూరల్ మండలంలోని వెంప, శ్రీరామపురం, తోకతిప్ప గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యాన విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఇంజేటి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమాల్లో బొడ్డు లక్ష్మీపతి, తిరుమాని నాగేశ్వరరావు, పొన్నమండ నాగేశ్వరరావు, భూపతి శామ్యేలు, ఈదా భూషణం గుత్తుల నాగమణి, మంద మార్తమ్మ, మంద శిరోమణి, గూడూరి సత్య పూర్ణిమ, తెన్నేటి పెద్దిరాజు, వెంకటేష్, మంద నరేష్ పాల్గొన్నారు. పాలకొల్లు: ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన వీకర్స్‌కాలనీలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, నేతలు చల్లా సోమేశ్వరరావు, గుబ్బల సత్యనారాయణ, వై.అజరుకుమార్, టి.శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాస్, శంకరం, వీరభద్రం, పోతురాజు పాల్గొన్నారు. నరసాపురం: విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నరసాపురం పట్టణంలోని 25వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.15 వేల కోట్లు విద్యుత్ భారాలను ప్రజలపై మోపిందని విమర్శించారు. అదానీ కంపెనీతో చేసుకున్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడలి బేబీ, పాలా జ్యోతి, ఎడ్లపల్లి ఝాన్సీరాణి, విజయలక్ష్మి, హైమావతి, సరోజిని, లక్ష్మీ, సుధారాణి పాల్గొన్నారు. మండలంలోని ఎల్‌బిచర్లలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జల్లి రామ్మోహన్‌రావు మాట్లాడారు. పెంటపాడు: సిపిఎం ఆధ్వర్యాన స్థానికంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, నేత చిర్ల పుల్లారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బంకురు నాగేశ్వరరావు, మీసాల శ్రీను, పెనగంటి దుర్గా, చిర్ల సత్యనారాయణరెడ్డి, సత్తి కనికిరెడ్డి, వెలగల సాయిమణికంఠరెడ్డి, చిర్ల రోహిత్‌రెడ్డి, మురుపో జాన్‌రాజు పాల్గొన్నారు. తణుకు: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, మళ్లీ పెంచాలనే ఆలోచన మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ప్రతాప్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్, పట్టణ కార్యదర్శి అజయకుమారి మాట్లాడుతూ ప్రజల జీవన పరిస్థితులు పట్టించుకోకుండా అధికారంలోకి ఎవరు వచ్చినా బాదుడేనన్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గార రంగారావు, రాము, రాధాకృష్ణ, సూర్యనారాయణ, మోహన్, నిఖిల్ తేజ్, అనురాధ, చిట్టెమ్మ, అన్నపూర్ణ, లక్ష్మీదేవి, గుబ్బల గోపీ, ఎన్.ఆదినారాయణబాబు, అనంతలక్ష్మీ, గార వెంకాయమ్మ పాల్గొన్నారు. ఇరగవరం: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఎం మండల కమిటీ కన్వీనర్ కామన మునిస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో కరెంటు బిల్లులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో జుత్తిగ రామాంజనేయులు, పాలా సత్యనారాయణ, పిల్లి ఏడుకొండలు, పెచ్చెట్టి నాగేశ్వరరావు, వీరవల్లి శ్రీను, శివయ్య, జక్కంశెట్టి గంగాధర్ పాల్గొన్నారు. మొగల్తూరు: విద్యుత్ భారాలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం భోగి మంటలు వేసి విద్యుత్ బిల్లులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో వీరా పాండురంగారావు, జట్టు కార్మికులు పాల్గొన్నారు. ఉండి: సిపిఎం ఆధ్వర్యాన మండలంలోని చెరుకువాడలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చీర్ల శేషు మాట్లాడారు.