ముమ్మరంగా ఒఎన్‌జిసి పైపులైన్‌ పనులు

ప్రజాశక్తి – నరసాపురం

రుస్తుంబాద గ్రామంలో ఒఎన్‌జిసి పైపులైన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం డిఎస్‌పి జి.శ్రీనివాస్‌ గ్రామంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. కొన్ని రోజుల క్రితం పోలీసు బందోబస్తు నడుమ పనులు చేయడానికి అధికారులు యత్నించారు. అయితే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీతో మాట్లాడారు. రెండు సార్లు చర్చల అనంతరం గ్రామస్తులు పనులు చేపట్టేందుకు అంగీకరించారు. మరలా రెండు రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️