మార్టేరు గ్రంథాలయంలో ఓరుగామి చిత్ర ప్రదర్శన

ప్రజాశక్తి – పెనుమంట్ర

కాగితాలకు సృజన జోడించి, కత్తెరతో వివిధ ఆకృతులను కత్తిరించడమే ఓరుగామి అని విశ్రాంత ఇంగ్లీష్‌ ఉపాధ్యాయిని పడాల సువర్ణ గౌరి అన్నారు. మంగళవారం మార్టేరు శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు తయారు చేసిన కాగితపు ఆకృతులను ప్రదర్శించారు. అనంతరం పిల్లలకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌తో పాటు చదవడం, రాయడం, ఇతర ఆటలు నేర్పించారు. జట్లుగా పిల్లలు పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ గుడిమెట్ల రామారెడ్డి, శాఖా గ్రంథాలయం అధికారి పిటి.శివకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️