ఎం ఎల్ ఏ దర్మరాజు
ప్రజాశక్తి-గణపవరం : జీవనానికి అవసరమైన త్రాగునీటి పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నయని ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల దర్మరాజు అన్నారు. శనివారం ముగ్గళ్ళ గ్రామంలో జల జీవన మిషన్ నిదులు 48 లక్షల 50 వేల రుపాయాల వ్యవంతో 45 వేల లీటర్ల నిల్వ గల ఒ హెచ్చ్ ఎస్ ఆర్ వాటర్ టేంకు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేసి మాట్లాడారు. గతంలో గ్రమీణా ప్రాంతాల్లో త్రాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి క్రుషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
