అంగన్వాడీలపై పోలీసు నిర్బంధం

Mar 10,2025 12:23 #West Godavari District

– జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు
– పోలీసుల అదుపులో సుమారు 200 మంది అంగన్వాడీలు
– ఖండించిన అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్

ప్రజాశక్తి-భీమవరం : తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు విజయవాడలో సోమవారం తలపెట్టిన మహాధర్నాను భగ్నం చేసేందుకు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. పలువురి అంగన్వాడీలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బయలుదేరిన కొంతమందిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మరి కొంతమందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పాలకొల్లు రైల్వే స్టేషన్లో 70 మంది, తణుకు బస్టాండ్లో 30 మంది, చేబ్రోలు వద్ద 40 మంది , పెనుమంట్ర వట్లూరు దగ్గర 15 మంది, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో 25 మంది అంగన్వాడీలను పోలీసులు నిర్బంధ విధించారు. విజయవాడ వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అంగన్వాడీలు నేలపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అంగన్వాడిలపై పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించిన ఈ చర్యలను అంగన్వాడీ యూనియన్లు, సిఐటియు ఖండించాయి.

➡️