ప్రజాశక్తి – నరసాపురం
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం బహుమతుల ప్రధానం చేశారు. యుటిఎఫ్ భవనంలో జనవిజ్ఞాన వేదిక నరసాపురం కన్వీనర్ ఆకెన రామకృష్ణ ఆధ్వర్యంలో మండల, పట్టణ స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలలో మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు) 34 మార్కులతో మండల స్థాయిలో మొదటిస్థానం పొందగా, 31 మార్కులతో జెడ్‌పి హైస్కూల్ యర్రంశెట్టి వారి పాలెం 2వ స్థానంలో, 28 మార్కులతో జిల్లా పరిషత్ హై స్కూల్ చిట్టవరం మూడవ స్థానంలో నిలిచింది. పట్టణ స్థాయిలో మున్సిపల్ హై స్కూల్ టేలర్ పేట్ 26 మార్కులతో మొదటి స్థానంలోనూ, ఎస్‌ఎన్‌ఎస్ మున్సిపల్ హై స్కూల్ 2, 3 స్థానాలలో(రెండు టీంలు పాల్గొన్నాయి) నిలిచాయి. విజేతలందరికీ జనవిజ్ఞాన వేదిక తరపున బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జి.సుబ్బారావు, డేనియెల్ అరవింద్, జిఎస్‌ఎస్‌ఆర్ స్వామి, జిఆర్.సునీల్ కుమార్, అడపా శ్రీను, పి.అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.