బీమా రంగంలో విదేశీ పెట్టుబడులపై నిరసన

ప్రజాశక్తి – పాలకొల్లు

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమితిని 74 నుంచి వంద శాతానికి పెంచుతూ కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడాన్ని నిరసిస్తూ స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం వద్ద బీమా ఉద్యోగులు ఏజెంట్లతో కలిసి మంగళవారం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ ప్రతిపాదనలు దేశ ఆర్థిక స్వావలంబనకు విరుద్ధమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బీమా రంగాన్ని విదేశీ పెట్టుబడీదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రజలను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై ప్రస్తుతం వసూలు చేస్తున్న జిఎస్‌టినీ ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పాలకొల్లు ఏజెంట్ల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ, కార్యదర్శి సురేంద్రన్‌, నాయకులు నాళం బాపిరాజు, కురియ నల్లింటన్‌ మాట్లాడారు.

➡️