దేశాభివృద్ధికి రాజీవ్‌ గాంధీ కృషి ఎనలేనిది

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

రాజీవ్‌ గాంధీ 33వ వర్థంతి ఏలూరు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి రాజనాల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశాభివృద్ధికి మొట్టమొదటిగా ఇంటర్నెట్‌ పరిచయం చేసిన మహనీయుడు రాజీవ గాంధీ అని కొనియాడారు. దేశం టెక్నాలజీ రంగంలో ఇంత అభివృద్ధి సాధించాడానికి రాజీవ్‌ కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బ్లాక్‌ టు ప్రెసిడెంట్‌ లంకా రామ్మోహన్‌, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా మీడియా కోఆర్డినేటర్‌ యోహాన్‌ రాజు, కాంగ్రెస్‌ నగర ఉపాధ్యక్షుడు కెఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు. పోలవరం : రాజీవ్‌ గాంధీ వర్థంతిని పోలవరంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు ముచ్చిక సీత ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీత మాట్లాడుతూ దేశ ప్రధానిగా నిజాయతీగా విధులు నిర్వహించి దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. మరలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటుందన్నారు.

➡️