తహశీల్దార్‌గా రాజకిషోర్‌

ప్రజాశక్తి – మొగల్తూరు

మొగల్తూరు తహశీ ల్దార్‌గా కె.రాజ కిషోర్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ నియమితులైన సిహె చ్‌.విద్యాపతి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు బదిలీపై వెళ్లారు. ఎన్‌టిఆర్‌ జిల్లా వీరులపాడు నుంచి మొగల్తూరు బదిలీపై రాజ కిషోర్‌ వచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్‌ నరేష్‌ బాబు, మండల సర్వేయర్‌ ధనంజయ, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

➡️