పురుగుమందుల విక్రయంలో నిబంధనలు తప్పనిసరి

మండల వ్యవసాయాధికారి పల్లగాని చెన్నారావు

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, ఎరువులు, పురుగుమందులు కొన్న ప్రతి రైతుకు బిల్లులను ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి పల్లగాని చెన్నారావు అన్నారు. బుధవారం ఆగిరిపల్లి వ్యవసాయ కార్యాలయంలో మండల పరిధిలోని ఎరువులు, పురుగు మందుల విక్రయ డీలర్లకు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లందరూ ఇ-పాస్‌ మిషన్ల్‌ ద్వారా బయోమెట్రిక్‌ విధానంలోనే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, అధీకృత డిస్టిబ్యూటర్‌ ద్వారానే కోనుగోలు చేసి విక్రయించాలని, డీలర్లందరూ స్టాక్‌ రిజిస్టర్ల్‌, బిల్‌బుక్‌లు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

➡️