నరసాపురం: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, జూదం, పేకాట వంటి చెడు సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వాటిని నిర్వహించే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుని పందేలను నిలుపుదల చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నరసాపురం డిఎస్‌పి డాక్టర్ జి.శ్రీవేదకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు బోడిద జోగేశ్వరరావు, కోడి లక్ష్మణరావు పాల్గొన్నారు. తణుకు : సాంప్రదాయ ముసుగులో కోడిపందేలు, గుండాట, పేకాట, తాగుడు వ్యసనాలతో సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వీటిని అరికట్టాలని, సిపిఎం, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం ఇరగవరం మండల పోలీస్ స్టేషన్ అధికారులకు ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి, నాయకులు గుత్తుల రామాంజనేయులు, గుత్తుల శివయ్య, పెచ్చెటి సుబ్బారావు, జక్కంశెట్టి గంగాధరరావు పాల్గొన్నారు. నరసాపురం: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, మద్యం అక్రమ విక్రయాలు నివారించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ డిమాండ్ చేశారు. శనివారం ఐద్వా ఆధ్వర్యంలో పూర్ణ నరసాపురం డిఎస్‌పి డాక్టర్ జి.శ్రీవేద, నరసాపురం ఆర్‌డిఒ దాసిరాజుకి వినతిపత్రాన్ని అందించారు.