ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : రుద్రరాజు రామo ఆశయ సాధనకు కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం మండల కార్యదర్శి పి మోహన్ రావు అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రైతు నేత తొలితరం కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ రుద్రరాజు రామo 30వ వర్ధంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట సిపిఎం కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా యువజన సంఘం అధ్యక్షునిగా ఎన్నికై యువకులతో రాజకీయ చైతన్యానికి నూతన ఉత్సవం నింపిన నాయకుడు రుద్రరాజు రామo అని కొనియాడారు. ఈయన వ్యవసాయ కూలీలకు రాత్రిపూట పాఠాలు చెబుతూ యువజన సంఘాలు స్థాపించేవారు. పేటలో గ్రామాల్లో రాత్రి సమయంలో రచ్చబండ వద్దకు చేరి యువకులతో అద్భుదయ సాహిత్యము చదివి వినిపించేవారని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సిర్రా నరసింహమూర్తి, తలుపురి బుల్లబ్బాయి, కుసుమ జయరాజు, ఎస్ వి ఎన్ శర్మ, సీనియర్ నాయకులు తోటపల్లి సత్యనారాయణ, కొండేటి సత్యనారాయణ, చదలవాడ చంటిబాబు, శ్రీపాద ప్రజ్వల, శ్రీపాద ప్రభవ తదితరులు అని చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు.