మంతెన రామరాజుకు సత్కారం

ప్రజాశక్తి – నరసాపురం

ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్టియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా నియమితులైన టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఉండి మాజీ ఎంఎల్‌ఎ మంతెన రామరాజును నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ సన్మానించారు. బుధవారం నరసాపురం జనసేన కార్యాలయానికి విచ్చేసిన రామరాజుకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నరసాపురం టిడిపి ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.

ఆచంట : ఇటీవల రాష్ట్ర ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులైన మంతెన రామరాజు ఆచంట ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఎంఎల్‌ఎ నివాసంలో కలిసి కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంతెన రామరాజు అన్నారు. ఈ సందర్భంగా రామరాజును ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కట్టా రాంబాబు, విరవల్లి శ్రీనివాస్‌, పిన్నమనేని శ్రీనివాస్‌, జుత్తుగ శ్రీనివాస్‌, చిన్నంశెట్టి హరినాయుడు పాల్గొన్నారు.

➡️