గ్రామాభివృద్ధే ధ్యేయం : సర్పంచి

ఉండి: గ్రామ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తమ పాలన సాగిస్తున్నామని పెద్దపుల్లేరు గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ఉండి మండలం పెదపుల్లేరు గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచి పార్వతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు తీర్మానాలు చేశారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, బోర్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️