సిపిఐ సీనియర్‌ నేత నాగేశ్వరరావు సేవలు ఎనలేనివి

ప్రజాశక్తి – కామవరపుకోట

సిపిఐ సీనియర్‌ నేత, ఎపి రైతు సంఘం నేత కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభ కామవరపుకోట ప్రభు స్వామి సిమెంట్‌ వరాల కంపెనీ వద్ద మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ మండల కార్యదర్శి టివి ఎస్‌.రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగేశ్వ రరావు ఉమ్మడి కృష్ణాజిల్లా గుడిపాడులో జన్మించి, ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారని తెలిపారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడం కోసం కృష్ణ గోదావరి జిల్లాలను అనుసంధానం కోసం అహర్నిశలూ కృషి చేశారని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ జలదర్శిని’ పుస్తకాన్ని రచించి ఆ పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తో ఆవిష్కరించి, ప్రజలకు అంకితం చేసిన మహానేత నాగేశ్వరరావు అని కొనియాడారు. ముందుగా ఆయన చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. ఈ సభలో ఎఆర్‌పాలెం భూ పోరాట సమితి నాయకులు శెట్టి నాగ బాలాజీ, నల్లమోతుల శ్రీనివాసరావు, గదుల రామస్వామి పాల్గొన్నారు.

➡️