ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

యుటిఎఫ్‌ కృషి అభినందనీయండి

ఇఒ నారాయణ

ప్రజాశక్తి – కాళ్ల

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం యుటిఎఫ్‌ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖాధికారి విఎన్‌ఎస్‌ఎస్‌ఎల్‌.నారాయణ అన్నారు. పెదఅమిరం స్పెషల్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల్లో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం కార్యక్రమంలో భాగంగా ఆటోపై మైక్‌ ప్రచార కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని చక్కని సౌకర్యాలు విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన కిట్‌తోపాటు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల గురించి తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రయత్నించాలని కోరారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయరామరాజు మాట్లాడుతూ హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా ఏర్పడ్డ యుటిఎఫ్‌ హక్కుల కోసం పోరాటంతో పాటు తమ బాధ్యతల పట్ల కూడా అంతే అంకితభావంతో ఉంటుందన్నారు. డివైఇఒ ఎన్‌.రమేష్‌, ఎంఇఒ ఎ.రవీంద్ర, ఎంఇఒ-2 వి.వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, క్లస్టర్‌ హెచ్‌ఎం కె.నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చక్కని కృషి చేస్తున్న యుటిఎఫ్‌ మండల శాఖను అభినందించారు. యుటిఎఫ్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.రాజమౌళి కోటేశ్వరస్వామి, ఎం.శంకర్రావు మాట్లాడుతూ ప్రతిరోజూ మూడు గ్రామాల చొప్పున ఆటోలో తిరుగుతూ అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్‌.పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణంరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి.రామరాజు, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ డి.రోజాపుష్పం, ఉపాధ్యాయులు మురళీ, కుమార్‌రాజు, రవిచంద్ర కుమార్‌, సునీత, సుధారాణి గ్రామ పెద్దలు రాఘవులు, సెబాస్టియన్‌ పాల్గొన్నారు.

➡️