ఎపిపిగా శివరామకృష్ణ బాధ్యతల స్వీకరణ

తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నూతనంగా ప్రారంభించిన 11వ అదనపు జిల్లా కోర్టు ప్రథమ అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా సీనియర్‌ న్యాయవాది కుసులూరి శివరామకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో తాడేపల్లిగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గాను, ప్రధాన కార్యదర్శి గాను, సబ్‌ కోర్ట్‌ ఎపిపిగా, అడిషనల్‌ సిపిగా సమర్థవంతంగా పనిచేశారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకునిగా కూడా పనిచేశారు. ఈయన నియామకం పట్ల బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాదులు తోట రాంబాబు, మాకా శ్రీనివాసరావు, ఎం.మాధవబాబు, ముప్పిడి సురేష్‌ రెడ్డి, కె.హరనాధ్‌, జి.ముఖర్జీ, కె.నాగేశ్వరరావు, కొవ్వూరి అప్పిరెడ్డి, జి.గోపీకృష్ణ, సిరిగినీడి విజయకృష్ణ, జి.దుర్గాదేవి, తోట సత్యనారాయణ, వైస్‌ ప్రెసిడెంట్‌ కంకట శ్రీనివాస్‌, సెక్రటరీ నారాయణ స్వామి, సత్యనారాయణమూర్తి, అడ్వకేట్‌ క్లర్క్‌ ప్రెసిడెంట్‌ సూర్యచంద్రరావు, సీతారామయ్య, శేషగిరి, కోర్ట్‌ సిబ్బంది, పోలీస్‌ అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రాసిక్యూటర్‌గా బాధితుల తరపున వాదించి, వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. 11వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి షేక్‌ సికిందర్‌ బాషా నూతన బాధ్యతలు తీసుకొన్న కుసులూరి శివ రామకృష్ణకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️