సొసైటీ ఛైర్‌ పర్సన్‌, డైరెక్టర్లు రాజీనామా

ప్రజాశక్తి – ఆచంట

2024 సాధారణ ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలైన నేపథ్యంలో వల్లూరు సహకార పరపతి సంఘం ఛైర్‌పర్సన్‌ నారిన వీర వెంకట సత్యనారాయణ, డైరెక్టర్లు గంగోలు శ్రీనివాసరావు, పిచ్చెట్టి సత్యనారాయణలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసి సొసైటీ కార్యదర్శి ఏడిద వెంకటకృష్ణారావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఈ రాజీనామా పత్రాలను భీమవరం డిసిసిబి కార్యాలయంలో అందజేస్తామని తెలిపారు.

➡️