కాల్వగట్టుపై ఇళ్ల తొలగింపునకు గడువివ్వండి

ప్రజాశక్తి – ఆకివీడు

అయిభీమవరంలో కాల్వ గట్టుపై నివాసితుల ఇళ్ల తొలగింపు వెంటనే ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం సిపిఎం బృందం ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటికే స్థలాలు పొందిన వారు ఆరు నెలల సమయం గడువు కావాలని న్యాయబద్దంగా అడుగుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన భూముల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోమంటే వారు ఎక్కడుండాలని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎ, అధికారులు స్పందించి ఆరు నెలల గడువు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో కె.తవిటినాయుడు, పెంకి అప్పారావు, డోకల లక్ష్మి, సందక ఉదయకుమారి, బివి.వర్మ, కింజరపు పార్వతి, డోకల రవితేజ బొడ్డుపల్లి రాంబాబు, సందక సూరిబాబు, ఎర్ర కృష్ణవేణి, దొడ్డి పద్మ, శనపతి.శ్రీను, ఎస్‌.సింహాచలం, బలరాం, ఎస్‌.అప్పన్న, పి.మధు, అప్పలకొండ, నగేష్‌, ఆర్‌.శ్రీను, భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️