చలివేంద్రాలు ప్రారంభం

తణుకు : తణుకు పట్టణం, పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించినట్లు తణుకు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆదివారం తణుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 5 చలివేంద్రాలను ఎంఎల్‌ఎ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సేవా ధృక్ఫధంతో వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా ప్రజలకు దాహార్తి తీర్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్ధలు ముందుకు రావాలని కోరారు.

➡️