అక్రమ లేఅవుట్ వేస్తే కఠిన చర్యలు

Nov 30,2024 10:30 #West Godavari District

సరిపల్లి కార్యదర్శి రామాంజనేయులు
ప్రజాశక్తి-గణపవరం : మండలంలో సరిపల్లి పంచాయతీ పరిదిలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డి రామాంజనేయులు శనివారం ఒక ప్రకటన తెలిపారు. గ్రామంలో వ్వవసాయ భూములను వ్వవసాయేతర భూములుగా మార్చి వ్యపార షాపులను అనుమతి లేకుండా నిర్మాణం చేయవద్దని అన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారి ఏలూరు అర్బన్ డవల్పమెంట్ అదారాటి అనుమతి లేకుండా స్తలాలో నిర్మాణం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలేగే అనుమతి లేకుండా భవననిర్మాణంచేస్తే వారికి పంచాయతీ భవన నిర్మాణ అనుమతులు రావని దీంతో పాటు కుళాయి, కరంటు ఏర్పాటు కి ఎన్ ఒ సి ఇవ్వమని తెలిపారు ప్రభుత్వ నిబంధనలు వ్యతేరేకిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️