అక్రమ లేఅవుట్‌ వేస్తే కఠిన చర్యలు

గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు

గణపవరం : మండలంలోని సరిపల్లి పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.రామాంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి వ్యాపార షాపులను అనుమతి లేకుండా నిర్మాణం చేయవద్దని అన్నారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి అనుమతి లేకుండా స్థలాల్లో నిర్మాణం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా భవన నిర్మాణం చేస్తే వారికి పంచాయతీ భవన నిర్మాణ అనుమతులు రావని, దీంతో పాటు కుళాయి, కరెంటు ఏర్పాటుకు ఎన్‌ఒసి ఇవ్వమని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

➡️