విద్యార్థులు దంతాలపై అవగాహన కలిగి ఉండాలి

Dec 5,2024 12:32 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) :  విద్యార్థులు దంతాలపై అవగాహన కలిగి ఉండాలని రత్నాస్ డెంటల్ హాస్పిటల్ వైద్యాధికారి మేడపాటి మురళి జోగిరెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు మెయిన్ పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు  ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి, దంతాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు టూత్  పేస్టులో బ్రష్ లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మానవతా మండల శాఖ అధ్యక్షులు కుక్కల లీలా ప్రసాదు  మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ తాళం శ్రీనివాస్, వల్లూరు సర్పంచ్   నేల పూడి  బేబీ,రామ్మోహన్, మానవతా కార్యదర్శి నిమ్మకాయల గంగా రామ్, కోశాధికారి  తమ్మినీడి సత్యనారాయణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల కృష్ణారావు, గ్రామ పెద్దలు గెద్దాడ శ్రీనివాస్, వీరవల్లి వీరమణి, స్కూల్ కమిటీ ఛైర్మన్ కాసాని రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️