గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు

ప్రజాశక్తి – నరసాపురం

ఆంధ్రప్రదేశ్‌ పౌర గ్రంథాలయ సంచాలకులు, పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారుల ఉత్తర్వులు ప్రకారం ఈనెల 15వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు పిల్లలకు సంబంధించిన వివిధ సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని గ్రేడ్‌ వన్‌ లైబ్రేరియన్‌ కెజెఎస్‌ఎల్‌ కుమారి తెలిపారు. గురువారం పాల్గొన్న విద్యార్థులచేత కథలు పుస్తకం చదివించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ చినమిల్లి శ్రీనివాసరావు, హెచ్‌ఆర్‌డి డైరెక్టర్‌ పాల్గొని మాట్లాడుతూ వేసవి శిక్షణా తరగతుల ముఖ్య ఉద్ధేశం పిల్లలు ఎక్కువగా పుస్తకాలు చదవాలి, చదవడంతో పాటు మననం చేసుకోవాలి, పవర్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ సంపాదించుకుని ఒక లక్ష్యం కలిగి ఉండటానికి గ్రంథాలయంలో ఇది ఒక అవగాహన సదస్సు వంటిదని తెలిపారు. చదవడం ద్వారా సంపూర్ణ పరిజ్ఞానం వస్తుంది, తద్వారా మంచి పౌరుడిగా అభివృద్ధి చెందిన వ్యక్తిగా విజయం సాధిస్తారన్నారు. వేమన పద్యాలపై శ్రీనివాస్‌ మాస్టారు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతుల్లో పండా త్రినాథ్‌, బాబుశ్రీ, సుధీర్‌ మోహన్‌, సూర్యం బాబు, జీవన్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రేడ్‌ వన్‌ లైబ్రేరియన్‌ కెజె ఎస్‌ఎల్‌.కుమారి కోరారు.

➡️