ప్రజాశక్తి – మొగల్తూరు
జిల్లాస్థాయి క్రీడా పోటీలలో మొగల్తూరు మండలానికి చెందిన ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచారు. యుటిఎఫ్ స్వర్ణోత్సావాలలో భాగంగా ఆదివారం తణుకులో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీలలో మండలంలోని కెపిపాలెంలో ఉన్న జెడ్‌పి ఉన్నత పాఠశాలకు వై.రవి (పిజిటి) 200 మీ పరుగు పందెంలో ప్రథమ స్థానం, షటిల్ బ్యాడ్మింటన్ తృతీయ స్థానంలో నిలిచారు. ఇదే పాఠశాలకు చెందిన కె.శ్రీనివాస బాబు (పిజిటి) 200 మీటర్ల పరుగు పందెంలో 45 ప్లస్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారు. జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని యుటిఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి కృష్ణమోహన్, సిహెచ్.శ్రీనివాసులు తెలిపారు.