టీడీపీ-జనసేన కూటమికే అనుకూలం

Feb 12,2024 13:10 #West Godavari District
TDP-Janasena alliance is in favour

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా) : టీడీపీ -జనసేన కూటమికి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని నరసాపురంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ ఏం ఏ షరీఫ్ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ
టిడిపి జనసేన నేతలు సమన్వయంతో పనిచేయాలి. టికెట్ల ఇంకా ఎవరికి కేటాయించలేదు. టిడిపి, జనసేన అధిష్టానాలు కూర్చుని నిర్ణయిస్తారు. వైసిపి దుర్మార్గపు పాలన అంతమొందే రోజులు దగ్గర లోనే ఉన్నాయి. జగన్ చేస్తున్న దుర్మార్గాలను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ తరుపున జగన్ సొంత చెల్లి దైర్యంగా ప్రశ్నిస్తున్నారు. టిడిపి జనసేన అధినేతలు ఇరుపార్టీలకు ఆమోదయోగ్యంగా కేటాయిస్తారు. టికెట్ల ఎవరికి ఇచ్చిన క్యాడర్ గెలుపే దిశగా పని చేయాలి. ఈ కార్యక్రమంలో నరసాపురం టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️