వైసీపీలో చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

Apr 3,2024 11:41 #West Godavari District

ఉండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు

ప్రజాశక్తి-పాలకోడేరు : శృంగ వృక్షం చిన్న పేట ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన మహిళ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది బుధవారం వైసీపీలో చేరారు. స్థానిక చిన్న పేటలో ఉండి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహారాజు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చిన్న పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారాజు మాట్లాడారు. వైసీపీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. సంక్షేమం అభివృద్ధికి వైసిపి నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైసిపి గెలుపుకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు ), ఉండి ఏఎంసి చైర్మన్, జడ్పిటిసి పెంచేటి లక్ష్మీ తులసి, వెంకటేశ్వరరావు, సర్పంచ్ జంగం సూరిబాబు, ఉప ఎంపీపీలు ఆదాడ లక్ష్మీ తులసి, నరేష్ , కాప్షన్ సభ్యురాలు డాక్టర్ డి ఆర్ స్వర్ణలత, జాబత్తుల రవి, రంగారావు, గునుపూడి శ్రీను, మహిళలు పాల్గొన్నారు.

➡️