నరసాపురం: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో జెడ్‌పి హైస్కూల్, ఇంటర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు శనివారం నరసాపురం ఎంఎల్‌ఎ బొమ్మిడి నాయకర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలకు సంబంధించిన సమస్యలను తెలియజేసి వాటిని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఎంఎల్‌ఎ హామీ ఇచ్చారు.