వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు

Feb 12,2024 12:22 #West Godavari District
The death of Venkata Satthiraj is a great loss for the party

శివరామరాజు
ప్రజాశక్తి-ఉండి : పార్టీ సీనియర్ నాయకులు వేగేశ్న వెంకట సత్తిరాజు మరణం పార్టీకి తీరని లోటు అని ఉండి మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు ( కలవపూడి శివ) అన్నారు. సోమవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు వెంకట సత్తిరాజు (86) కుటుంబాన్ని పరామర్శించిన శివరామరాజు ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి పార్టీ జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శివరామరాజు మాట్లాడుతూ టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వెంకట సత్తిరాజు గత కొన్ని సంవత్సరాల నుంచి వయసు రిత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తమకు ఎన్నో సలహాలు అందిస్తూ తమ రాజకీయ ఉన్నతికి సహకరించారని ఆయన తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్, వెంకట సత్తిరాజు మేనల్లుడు సాగిరాజు సాంబశివరాజు మాట్లాడుతూ వెంకట సత్తిరాజు మరణం తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన స్థానాన్ని భర్తీ చేయలేనిదని కన్నీటి పర్యాంతమయ్యారు. వెంకట సత్తిరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో టిడిపి నాయకులు ముదునూరి కృష్ణంరాజు, కరిమెరక శ్రీను ఉన్నారు.

➡️