టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి

Feb 17,2024 13:46 #West Godavari District
The development of the state is with TDP

ప్రజాశక్తి-ఉండి: టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. శనివారం ఉండి మండలం ఉప్పులూరు లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మంతెన రామరాజు సమక్షంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యర్రా లక్ష్మీ హృషికేశ్వరరావు, వైసిపి నాయకులు కొక్కు కేశవరావు టిడిపిలో చేరారు. వీరికి మంతెన రామరాజు టిడిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారని అందుకే టిడిపిలో చేరికలు రోజురోజుకీ పెరుగుతున్నాయి అన్నారు. ప్రతి ఒక్కరు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లకు మద్దతు తెలపాలని వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. అనంతరం హృషీకేశ్వర రావు, కేశవరావు మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని చంద్రబాబుతోనే రాష్ట్రం గాడిలో పడుతుందని తమకు నమ్మకం ఉందని అందుకే టిడిపిలో తమ అనుచరులతో చేరినట్లు వారు తెలిపారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. మండలంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి అత్యధిక మెజార్టీ అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు లోకం సుబ్బారావు, నాయకులు యర్రా చిట్టిబాబు, కందుల రాధా బలరామకృష్ణ, మంతెన సాయి లచ్చిరాజు, గాజుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️