చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ప్రజాశక్తి – ఏలూరు

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడంపై జిల్లా అధికారులు ఎం.ముక్కంటి, ఎన్‌ఎస్‌.కృపావరం విద్యుత్‌ శాఖ అధికారులు సిబ్బందిని అభినందించారు. ఏలూరు వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం ఎపి ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ సాల్మన్‌రాజుతో కలిసి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎన్‌.కృపావరం, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.ముక్కంటి చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్రం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇపిడిసిఎల్‌ ఉద్యోగులు ముందుకొచ్చి ప్రజలు ఎక్కువగా సంచరించే ఆర్‌ఆర్‌పేట వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మందికి దాహార్తిని తీర్చేందుకు దోహదపడుతోందన్నారు. ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇపిడిసిఎల్‌ ఏలూరు సర్కిల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️