పెనుమంట్ర : మండలకేంద్రం పెనుమంట్ర, భట్లమగటూరు గ్రామాలలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి ఎ.జోషిలా మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఎంటియు-1318 రకంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు గుర్తించడం జరిగిందని, అయితే ఈ తెగులు చిరుజల్లులు పడటం వల్ల ఒక చేను నుంచి వేరొక చేనుకి ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుందని అన్నారు. అందుచేత వీలైతే తెగులు సోకిన పొలం నుంచి నీటిని మురుగుబోదుల ద్వారా బయటికి పంపాలే తప్ప చేను నుంచి చేను ద్వారా నీటిని పంపే విధంగా చూడకూడదని, ఈ విషయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.