పట్టించుకోని ఇరిగేషన్ శాఖ, ప్రజాప్రతినిధులు
సర్వత్రా రైతులు, ప్రజలు ఆవేదన
ప్రజాశక్తి – పెనుమంట్ర
మండలంలోని మార్టేరు వద్ద నరసాపురం ప్రధాన పంట కాలువ పరిసర ప్రాంతాల్లోని వర్తక, వ్యాపారులకు చెత్తను పారబోసే డంపింగ్ యార్డ్‌గా మారిందని ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన పంట కాలువ పరిస్థితి చెత్తతోను, కోళ్ల, పశువుల వ్యర్థాలతో నింపివేస్తున్నా, ఇరిగేషన్ శాఖ అధికారులుగానీ, నీటి సంఘాల ప్రతినిధులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యవసాయ భూముల కోసం, గృహ నిత్య అవసరాల కోసం, రక్షిత మంచినీటి పథకం కింద వాటర్ ట్యాంక్‌లకు ఈ నీరు వెళుతుందని వారు పేర్కొన్నారు. పిల్ల కాలువలు ద్వారా ప్రతి గ్రామానికి ఈ పంట కాలవ నుంచి నీటి సరఫరా చేయాలని, అయితే ప్రస్తుతం పంట కాలువలో ఉన్నటువంటి మలినమైన నీరు వల్ల, ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏమిటని వారంతా ప్రశ్నిస్తున్నారు.