పోలింగ్ బూత్ ను పరిశీలించిన సబ్ డివిజన్ ఎన్నికల అధికారి

Dec 5,2024 10:23 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):నరసాపురంలో గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పట్టణంలో స్టీమర్ రోడ్ లోని మున్సిపల్ స్కూల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ ను సబ్ డివిజన్ ఎన్నికల అధికారి దాసిరాజు పరిశీలించారు. ఈ కేంద్రంలో మొత్తం 425 ఓట్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవో దాసిరాజు, తహశీల్దార్ రాజరాజేశ్వరి పరిశీలించారు.

➡️