జగనన్న కాలనీలో దొంగలు భయం

Apr 3,2024 13:16 #West Godavari District

ఇసుక, సిమెంట్, ఐరన్, వాటర్ మోటార్లు దొంగిలిస్తున్న కేటుగాళ్లు
ఆందోళనలో జగనన్న కాలనీ వాసులు

ప్రజాశక్తి-పాలకోడేరు : జగనన్న కాలనీలు కేటుగాళ్లకు అడ్డగా మారాయి. కాలనీలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇసుక, సిమెంట్, ఐరన్ ,వాటర్ మోటర్లు ఇలా ఒకటేమిటి గృహ నిర్మాణానికి సంబంధించి ఏ సామాగ్రి దొరికిన మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీవాసులు దొంగల భయంతో ఆందోళన చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో వాటర్ ప్లాంట్ సమీపాన ఉన్న జగనన్న కాలనీలో కాలనీ వాసులను దొంగల బెడద వెంటాడుతుంది. సొంత ఇంటిని నిర్మించుకునేందుకు నాన్న తంటాల పడి ఇంటిని నిర్మాణం చేసుకుంటున్న నేపథ్యంలో నిర్మాణ సామాగ్రిని ఎవరూ లేని సమయంలో కేటుగాళ్లు మాయం చేస్తున్నారు. ఇసుక సిమెంట్ ఐరన్ వాటర్ మోటార్లు సైతం దొంగిలిస్తున్నారు. ఒక పక్క కాలనీకి వెళ్లేందుకు దారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుంటే ఇదే అదులుగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. మంగళవారం రాత్రి రెండు గృహాలకు చెందిన విద్యుత్తు మోటార్లను దొంగలించకపోవడంతో కాలనీవాసులు లభో ధిభో మంటున్నారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలు జరగకుండా గట్టి నిఘ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

➡️