ఇంటర్‌ ఫలితాల్లో తిరుమల విద్యార్థుల ప్రభంజనం

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

రాష్ట్ర ఫ్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో భీమవరం తిరుమల జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థులు అత్యద్భుతమైన ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలియజేశారు. కళాశాలలో ఆదివారం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపిసి విభాగంలో 470 మార్కులకు వివి.మణికంఠ సత్యసాయి 466 మార్కులతో భీమవరం పట్టణంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవటంతో పాటు ఒకరికి లేదా ఇద్దరికి కాకుండా 24 మందికి 465 మార్కులు రావటం అత్యద్భుతమైన ఫలితాలు సాధించటానికి నిదర్శనమని తెలియజేశారు. 460కుపైగా సాధించిన వారు 155 మంది, 450కుపైగా సాధించిన వారు 345 మంది, 440పైగా సాధించిన వారు 452 మంది, 420పైగా సాధించిన వారు 622 మంది, 400 పైగా సాధించిన వారు 739 మంది అలాగే బైపిసి విభాగంలో 440 మార్కులకు కె.శ్రావ్య, జి.హాసిని రిత్విక, జి.మనస్విని 434 మార్కులతో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, పి.జ్యోషిక శ్రీవల్లి 433, కె.మధునయన, కె.ప్రజ్ఞ ప్రిస్కిల్ల 432 మార్కులు, సిహెచ్‌.లెహర్ష, సిహెచ్‌.రేవతి, జె.విద్య 431 మార్కులు సాధించగా, 430పైగా మార్కులు సాధించినవారు 12 మంది, 420పైగా సాధించిన వారు 27 మంది, 400పైగా 51 మంది సాధించారని తెలియజేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపిసి విభాగంలో 1000 మార్కులకు ఎండి అశ్రఫ్‌ 990 మార్కులతో మొదటి స్థానం కైవసం చేసుకోగా, కె.విమల్‌, కె.మణికంఠ రెడ్డి, కె.సాయి హర్షిక్‌, కెఎన్‌.హాసిని, కెబిఎస్‌ఎల్‌.ప్రత్యూష 989 మార్కులతో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. 980పైగా మార్కులు సాధించినవారు 99 మంది, 970పైగా సాధించినవారు 228 మంది, 960పైగా సాధించిన వారు 340 మంది, 900పైగా సాధించిన వారు 703 మంది, బైపిసి విభాగంలో 1000 మార్కులకు యు.శరణ్య 988 మార్కులతో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, సిహెచ్‌బిఎల్‌.ప్రసన్న, కె.శేషశ్రీ 987 మార్కులు, పి.భవ్యశ్రీ, ఒపి.దుర్గా ప్రసాద్‌ 986 మార్కులు సాధించగా, 970పైగా మార్కులు సాధించినవారు 22 మంది, 950పైగా సాధించిన వారు 39 మంది, 900పైగా సాధించిన వారు 61 మంది అని తెలియజేశారు. విద్యాసంస్థల డైరెక్టర్స్‌ ఎస్‌.సాయిరాజు, పి.శ్రీనివాసవర్మ, జి.సతీష్‌ బాబు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత 96.8 శాతం, ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత 99.1 శాతం సాధించారని, ప్రథమ, ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తూ, ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, సిబ్బందికి అభినందనలు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు.

➡️