టిడ్కో గృహాల హామీని నిలబెట్టుకోవాలి

Feb 18,2024 12:05 #West Godavari District
Tidco should maintain the guarantee on the houses

ఎమ్మెల్యే నిమ్మల

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలోని 1, 2 వార్డుల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన నేతలు ఆదివారం ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ టిడ్కో గృహాలను నిరుపేదలైన మహిళా లబ్ధిదారులకు ఉచితంగా అందజేసి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వ ఐదేళ్లలో టిడ్కో గృహాలకు అరబస్తా సిమెంటు, రూపాయి పని నోచుకోలేదని చెప్పారు.  గత టిడిపి ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలు 90 శాతం పూర్తికాగా వైసీపీ ప్రభుత్వంలో మిగిలిన 10 శాతం పనులు జరగలేదని చెప్పారు. గృహాలను అప్పగించకుండానే లబ్ధిదారుల పేరిట బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి ప్రభుత్వం రూ కోట్ల సొమ్ము తన ఖాతాలోకి మళ్ళించిందని చెప్పారు. రుణాల పేరిట లబ్ధిదారుల నెత్తిన రుణభారం మోపిన వైసిపి ప్రభుత్వంను ప్రజలు గద్దె దింపాలని కోరారు. టిడ్కో గృహాలు చివరి లబ్ధిదారునికి అందే వరకు తన పోరాటం ఆగేది లేదని వారు చెప్పారు.

➡️