ప్రజాశక్తి మొగల్తూరు
కనకదుర్గ యువజన సంఘ సభ్యులు తన భూమికి వెళ్ళు దారిని ఆక్రమించుకుని తనని ఇబ్బందులు గురి చేస్తున్నారని పాలా త్రినాథ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆ సంఘ ఆరోపించారు . ఈ సందర్భంగా పేరుపాలెం సౌత్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘ అధ్యక్షులు కారాన్ని ధర్మరాజు, ఉపాధ్యక్షులు తిరుమనీ గణపతి, కార్యదర్శి తిరుమాని జగదీష్ లు మాట్లాడారు. పెనుబోతు లక్ష్మణ స్వామి అనే వ్యక్తి నుండి 1.93 ఎకరాల భూమిని సంఘం తరఫున సుమారుగా 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశామని తెలిపారు. కనకదుర్గ యువజన సంఘం సంఘం ఎవరి భూమి ఆక్రమణకు పాల్పడలేదని త్రినాధ చేసిన ఆరోపణలలొ వాస్తవం లేదని తెలిపారు. రైతులు పంట కాలవ సొంతంగా ఏర్పాటు చేసుకున్నారని పంట కాలవ ప్రభుత్వా ఇరిగేషన్ శాఖకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. సంఘం నకు చెందిన భూమిని పాల త్రినాథ్ కబ్జా చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. తమ సంఘానికి చెందిన భూమికి సిమెంట్ స్తంభాలు వేసుకుని ఫినిషింగ్ ఏర్పాటు చేసుకుంటే దానిని రాత్రి సమయంలో ఫినిషింగ్ను తొలగించి అక్కడ ఉన్న సర్వే చెట్లను అతని అనుచరులతో అర్ధరాత్రి సమయంలో నరికి వేయించి తమ సంఘ సభ్యులపై దౌర్జన్యనికి పాల్పడుతున్నట్లు తెలిపారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పెనుబోతు ధర్మరాజు, నాగేశ్వరరావు, తిరుమనీ సుబ్బారావు, సత్యనారాయణ, వీర రాఘవులు, పోతురాజు తదితరులు ఉన్నారు.