15న ఎస్‌ఆర్‌కెఆర్‌లో త్రిశూల్‌

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

ఈ నెల 15న ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తున్న విద్యార్థి ఉత్సవం ‘త్రిశూల్‌-2025’ నిర్వహి స్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణంరాజు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు విడుదల చేశారు. ఈ విద్యార్థి ఉత్సవాన్ని కళాశాల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌, ఎస్‌ఆర్‌కెఆర్‌ ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సెల్‌ (ఇఒసి) సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సత్యనారాయణరాజు, అసిస్టెంట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సిహెచ్‌.హరిమోహన్‌ తెలిపారు. ఈ విద్యార్థి ఉత్సవంలో ప్రధానంగా సాంస్కృతిక, క్రీడా విభాగాల్లో వివిధ రకాల పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

➡️