ఉచిత న్యాయవాదిని అందిస్తాం

నాల్గవ అదనపు జిల్లా జడ్జి సత్యవతి

తణుకు : న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తణుకు ఛైర్మెన్‌, నాల్గవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. శుక్రవారం తణుకు సబ్‌జైల్‌ని జిల్లా జడ్జి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ముద్దాయిలకు అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు 14వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నారని, న్యాయవాదులు జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు. న్యాయవాదులు టి.సత్యనారాయణరాజు, ఎ.అజయకుమార్‌, సూపరింటిండెంట్‌ మోహనరావు పాల్గొన్నారు.

➡️