మొగల్తూరు : లేసు అల్లికలలో మహిళల నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షన్ ప్రోగ్రాం డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ దక్షిణ భారత రివిజినల్ డైరెక్టర్ ఎ.లక్ష్మణరావు అన్నారు. మండలంలోని కేపీ పాలెంలో లేసు భవనాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లేస్ అల్లికలలో మహిళల అభివృద్ధికి భౌగోళిక గుర్తింపు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట హస్తకళా సేవా కేంద్రం విజయవాడ సహాయ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి, అపిటికో సీనియర్ కన్సల్టెంట్ ఐ.శ్రీనివాసరావు ఉన్నారు.