దళిత వర్గాల అభ్యున్నతికి కృషి

ఎంఎల్‌ఎ పితాని

ప్రజాశక్తి – పోడూరు

దళిత వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి, స్థానిక ఎంఎల్‌ఎ పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని దళిత నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో పితాని ఘన విజయం సాధించినందుకు ఆయన స్వగృహం కొమ్ము చిక్కాలలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు చెందాల్సిన 27 పథకాలు, ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ నిధులు, అంబేద్కర్‌ విదేశీ విద్య వంటి వాటిని రద్దు చేసిందని, వాటిని తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆచంట నియోజకవర్గ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు బీరా నరసింహ మూర్తి, సిద్ధాంతం, పెనుగొండ సర్పంచిలు నక్కా సోనిశాస్త్రి, చిన్ని, నాయకులు శిర్రా బాలాజీ, ఆకుమర్తి మోహన్‌ రావు, రాజేష్‌, వెంకటేశ్వరరావు, వర్ధనపు హరీకృష్ణ పాల్గొన్నారు.

➡️