డోలీమోతల బాధలు – ఎవరికి తెలుసు గిరిజనుల వెతలు..!

రావికమతం (అనకాపల్లి) : కిలో మీటర్ల చొప్పున కాలినడకన వెళుతూ పొరపాటున ఎవరికైనా ఏమైనా ఐతే ? అంతే చెప్పలేం..! నేరేడు బంధ గ్రామస్తుల వెతలు ఎవరికి తెలుసు ? అధికారులకు తెలిసినా అనుమతులు లేవంటూ … పట్టించుకోవడం లేదు.. ఆందోళనలు చేస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ గిరిజనులకు డోలీమోతల బాధలు తప్పడం లేదు..!

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడు బంధ గ్రామం గ్రామంలో విత్తనాల పండగ జరుగుతుంది. ఈ పండకు జికె వీధి మండలం పెద్దవలస పంచాయతీ పెద్దలంక గ్రామానికి చెందిన మర్రి బాబురావు (28) అత్తగారు ఉండే నేరేడు బంధ గ్రామంలో విత్తనాల పండగ జరుగుతుంది. కాబట్టి పండగ నిమిత్తం జెడ్‌ జోగంపేట గ్రామం నుండి నేరేడు బంధ గ్రామానికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. మార్గం మధ్యలో బాబురావు స్పఅహ తప్పి పడిపోయాడు. నేరేడు బంధ గ్రామస్తులు చరణ్‌. సంజీవ్‌ అనే యువకులు కలిసి కొత్తకోట గ్రామానికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి తిరిగివస్తూ … మార్గ మధ్యలో మర్రి బాబురావు స్పఅహ తప్పి పడిపోయి ఉండటాన్ని చూశారు. వెంటనే బాబురావు చుట్టాలకు గ్రామంలో ఉన్న ఈశ్వరరావు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామం నుండి కొంతమంది మహిళలు వచ్చి స్పఅహ తప్పిపోయిన బాబురావును మంచినీళ్లతో ముఖాన్ని కడిగి నీళ్లు తాగించడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. బాబురావు నడవలేకపోవడంతో అతడి మామ, కుటుంబ సభ్యుల సహాయంతో డోలి కట్టుకొని 2.1/2 కిలోమీటర్లు వరకు మోసుకొని వెళ్లారు.

ఫారెస్ట్‌ అనుమతులు లేక రోడ్డు లేదు…
నేరేడు బంద గ్రామంలో 80 జనాభా పివిటిజి కొంద గిరిజనులు కొండ శిఖరం గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025 జనవరి మొదటి వారంలో స్థానిక చోడవరం శాసనసభ్యులు కెఎస్‌ఎన్‌.రాజు జెడ్‌ జోగంపేట నుండి నేరేడు బంధ వరకు రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్డుకి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. దీనికి ఫారెస్ట్‌ అనుమతులు లేకపోవడంతో రోడ్డు పనులు మొదలు పెట్టలేదు. ఈ విషయంపై తేదీ 22 -1-2025 కలెక్టర్‌ కార్యాలయం వద్ద డోలీలతో ఆందోళన నిర్వహించి. జిల్లా కలెక్టర్‌ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేటికీ కూడా ఫారెస్ట్‌ అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే ఈ గ్రామం నుండి13 మంది చిన్న పిల్లలు 5 సంసారం నుండి 10 సంవత్సరాలు మధ్యలో. జెడ్‌ జోగంపేట ఎంపీపీ స్కూల్‌ కి. ప్రతిరోజు రాను పోను ఆరు కిలోమీటర్లు గుర్రాల మీద వెళుతూ చదువుకుంటున్నారు. మార్గ మధ్యలో ఒక్కొక్కసారి. తల్లిదండ్రులు గుర్రాలు తీసుకువెళ్లకపోవడంతో ఎత్తైన కొండ దారిలో నడుచుకుంటూ రావలసిన పరిస్థితి వస్తుంది. తక్షణమే ఈ గ్రామానికి ఫారెస్ట్‌ అనుమతులు మంజూరు చేసి. రోడ్డు పనులు ప్రారంభించవలసిందిగా గ్రామ పెద్దలు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు జిల్లా కలెక్టర్‌ ని వేడుకున్నారు.

➡️