పెరిగిన ఓటు.. ఎవరికి చేటు

May 15,2024 21:11

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్ని కల్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో 85.45 శాతం ఓటు నమోదు కావడంతో ఇరు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరి గెలుపు ధీమాలో వారు ఉన్నారు. నియోజక వర్గంలోని ఎస్‌కోట, కొత్తవలస, వేపాడ, లక్కవ రపుకోట, జామి మండలం లోని 13 గ్రామాలు కలిపి 2,22, 475 మంది ఓటర్లు ఉండగా సోమ వారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 85.45 శాతం పోలింగ్‌ జరిగి జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్‌ శాతం నమోదైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఈ ఎన్నికల్లో లక్కవర పుకోట, ఎస్‌కోట మండలాలపై అధిక శాతం ఓటింగ్‌ తమ పార్టీకే వస్తుందని టిడిపి శ్రేణులు నమ్మకం పెట్టుకోగా కొత్తవలస, వేపాడ మండ లాలపై వైసిపి శ్రేణులు ఆసలు పెట్టుకున్నారు. రఘురాజు గ్రూపు ఈ ఎన్నికల్లో టిడిపికి మద్దతు ప్రకటించడం ఆ పార్టీకి కలిసొస్తుందని టిడిపి నాయకులు అంచనా వేసుకుంటు న్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ గ్రూపు లలిత కుమారికి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ ఓట్లు తమకే పడతాయనీ వైసిపి శ్రేణులు చర్చిం చుకుం టున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ ఎన్నికల్లో టిడిపి శ్రేణులు తమ పార్టీకి పనిచేసిన విధంగా వైసిపి శ్రేణులు ఆ పార్టీకి పనిచేయలేదని నియోజకవర్గంలో ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఎవరు గెలిచినా వెయ్యి, రెండు వేలు మెజార్టీతో గట్టెక్కుతారని చర్చించుకుంటు న్నారు. ఏది ఏమైనాప్పటికీ అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే జూన్‌ 4 వరకూ వేచి చూడాల్సిందే.ఇరు పార్టీలకూ క్రాస్‌ ఓటింగ్‌ గుబులు వేపాడ : ఈ సార్వత్రిక ఎన్నికలో మండలంలో పెద్ద ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలో గ్రూపులు ఉండటం వల్ల పెద్ద ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని తెలిస్తోంది. దీంతో ఇరు పార్టీల్లో గుబులు మొదలైంది. క్రాస్‌ ఓటింగ్‌ ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన నెలకొంది. తమకే ఎక్కువ ఓట్లు వస్తాయని వైసిపి, కాదు తమకే అధిక ఓటు వస్తాయని టిడిపి నాయకులు బయటకు మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నా లోలోపల క్రాస్‌ ఓటుపై మల్లగుల్లాలు పడుతున్నట్లు చర్చించుకుంటున్నారు. పైగా ఇద్దరి దగ్గరా ఈ సారి ఓటర్లు డబ్బులు తీసుకుని వారికి నచ్చిన వారికేయడంతో లెక్కలు కట్టలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

➡️