ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో 36 మండ లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,832 పాఠశాలలు ఉన్నాయి. పైమరీ పాఠశాలలు 1,902, మున్సిపల్ 84, ఎయిడెడ్ 66, ప్రయివేట్ 773, మదరసాలు 07 వరకు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల పనివేళలను మార్చడం ద్వారా సంస్కరిం చాలని నిర్ణయించింది. జిల్లా విద్యాశాఖకు ఫైలెట్ ప్రాజెక్టు కింద అర్హత కలిగిన ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 36 మండలాలకు ఒకటి చొప్పున హైస్కూళ్లను ఎంపిక చేసింది. నెలాఖరులోపు నివేదిక అందజేయడానికి సిద్ధమైంది.అమలుకు..అవాంతరాలు..! ప్రభుత్వం పనివేళలను మార్పును ఎప్పటి నుంచి అమలు చేస్తుందో తెలియడం లేదు. పనివేళలు మార్పు సందర్భంగా రాష్ట్రంలోని పలువురు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాల సేకరణపై దృష్టి సారించింది. పాఠశాలల పనివేళల మార్పుపై లభించే స్పందన ఆధారంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.వేళల పెంపు భిన్నాభిప్రాయాలుప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థులు పాఠశాలల్లో గడిపితే అలిసిపోయే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు శీతాకాలంలో 5.30 గంటలు దాటితే చీకటి కమ్ముకునే అవకాశాల నేపథ్యం వంటి సమస్యలు అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి ఇంట్లో ఏదో ఒకటి తినే అలవాటును అధిగమించడానికి స్నాక్స్‌ను సరఫరా చేయాలనే సూచనలు వెల్లు వెత్తుతుండడం గమనార్హం.ఎంపిక చేసిన పాఠశాలలివే..జిల్లాలోని 36 మండలాలకు ఒకటి చొప్పున జాబితాను ఎంపిక ప్రక్రియ సిద్ధమైంది. వీటిని నెలాఖరులోపు అందజేయడానికి విద్యాశాఖ సిద్దమైంది. అట్లూరు మండలంలోని సోమేశ్వరం జడ్‌పిహెచ్‌ఎస్, బి.కోడూరులో ఆదిత్యరాంపేట, బి.మఠంలో కెఎంపల్లి, బద్వేల్ బాలికల హైస్కూల్, చింతకొ మ్మదిన్నె, చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి హైస్కూల్, చాపాడు జడ్‌పిహెచ్ ఎస్‌ను ఎంపిక చేసింది. చెన్నూరు బాలుర, కడప ఎంసిహెచ్‌ఎస్ మెయిన్, దువ్వూరు, గోపవరం మండలం భావనారాయణనగర్, జమ్మలమడుగు గర్ల్స్, కలసపాడు బాలుర, కమలాపురం పెద్దచెప్పలి హైస్కూల్, ఖాజీపేట మండలం అప్పనపల్లి హైస్కూల్, కొండాపురం హైస్కూల్, లింగాల మండలం పెద్దకుడాల హైస్కూల్, ముద్దనూరు హైస్కూళ్లతో జాబితాను సిద్ధం చేసింది. మైదుకూరు మండలం నంద్యాలంపేట హైస్కూల్, మైలవరం మండలం దొమ్మర నంద్యాల, పెద్దముడియం, పెండ్లిమర్రి హైస్కూళ్లను ఎంపిక చేసింది. పోరుమా మిళ్ల మండలం టేకూరుపేట, ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్, పులివెం దుల మండలం బ్రాహ్మణపల్లి, రాజుపాలెం, కాశినాయన మం డలం నరసా పురం, సిద్ధవటం మండలం ఎగువపేట, సింహాద్రిపురం, తొండూరు, వి.ఎన్‌పల్లి మండలం గంగిరెడ్డిపల్లి, వల్లూరు వేంపల్లి బాలుర, వేముల మండలం చాగలేరు, ఒంటిమిట్ట, యర్రగుంట్ల బాలుర హైస్కూళ్ల జాబితాను ఎంపిక చేసింది. పనివేళల పెంపుతో ఇబ్బందులు గ్రామీణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం శాస్త్రీయంగా రూపొందించిన విధానాన్ని మార్పు చేయడం తగదు. సాయంత్రం వేళకు విద్యార్థులు తీవ్రంగా అలిసిపోయే ప్రమాదం ఉంది.- ఎద్దుల రాహుల్, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు, కడప.పని వేళల మార్పు తగదు పాఠశాలల పనివేళల మార్పు తగదు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండడం వల్ల అలిసిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒత్తిడి పెరిగి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. – పి.మహేష్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప.పైలెట్ ప్రాజెక్టు జాబితా సిద్ధం పైలెట్ ప్రాజెక్టు అమలుకు అనుగుణంగా 36 మండలాలకు చెందిన హైస్కూళ్ల జాబితాను సిద్ధం చేశాం. ఈనెలాఖరు నాటికి ప్రభుత్వానికి అందజేస్తాం.- యు.మీనాక్షి, డిఇఒ, కడప.