ఎమ్మెల్సీగా విజయగౌరిని గెలిపించండి

Feb 2,2025 20:51

 ప్రజాశక్తి – పార్వతీపురం : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోరేడ్ల విజయగౌరిని గెలిపించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్‌ రావు కోరారు. ఆదివారం స్థానిక చర్చి గుడి సెంటర్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహిం చిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుటిఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకురాలి గా విజయగౌరి గతంలో చేసిన ఉద్యమాలు, పోరాటాల గురించి అందరికీ తెలిసిం దేనని చెప్పారు. ఇంతవరకు శాసనమండలికి మహిళా ఉపాద్యాయురాలిని ఎన్నుకోలేదని, ఈ అవకాశాన్ని రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉపాధ్యాయులు సహకరించా లని కోరారు. ఆరేళ్లు ఉపాధ్యాయ సర్వీస్‌ను వదిలి ఈ ఎన్నికల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయగౌరి మాట్లాడుతూ చట్టసభల్లో ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తడానికి అవకాశం దొరికిందని, ఉపాధ్యాయులంతా గెలిపిం చాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట రమేష్‌, కె.భాస్కరరావు, హెచ్‌ఎం, సిఆర్టీ, లెక్చరర్‌, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు గోవిందరావు, సోమేష్‌, గణపతి, వీరాచారి పాల్గొన్నారు.

➡️