ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 డిసెంబర్ 22న నగరం సాయిదీప్తి ఐఐటీ, మెడికల్ అకాడమి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో విజేతలను బుధవారం దీప్తి విద్యా సంస్థల చైర్మన్ డి.వి.వి.సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఉన్నత పాఠశాలల విభాగంలో నిర్వహించిన పరీక్షకు 300 మంది హాజరు కాగా 268 మంది క్వాలిఫై అయ్యారన్నారు . ప్రయివేట్ పాఠశాలల విభాగంలో రాజోలు అక్షర పాఠశాల విద్యార్ధి కొత్తపల్లి శంకర్ 50/50 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని చెప్పారు. మామిడికుదురు దీప్తి పాఠశాల విద్యార్ధిని బళ్ళ సాయి కార్తీక 48/ 50 మార్కులతో ద్వితీయ స్థానం, రాజోలు చిల్డ్రన్స్ పాఠశాల విద్యార్ధిని చొల్లంగి వర్షిత 36/50 మార్కులతో తృతీయ స్థానం పొందారన్నారు ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పి.గన్నవరం హై స్కూల్ విద్యార్థి గంటా స్వాతి 36/50తో ప్రథమ స్థానంలో నిలువగా, పైడిపర్తి విజయ శివాని (32/50 కాట్రేనిపాడు హై స్కూల్ ) ద్వితీయ స్థానంలో, వేగి హర్షిత (31/50 మామిడికుదురు (హై స్కూల్ ), మొల్లా ఫాతిమా (31/50 పి. గన్నవరం హై స్కూల్ ) తృతీయ స్థానంలో ఉన్నారు. అలాగే మిగిలిన మార్కులు వివరాలను త్వరలో పాఠశాలల వారీగా అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సాయిదీప్తి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జక్కంపూడి శివప్రసాద్, అధ్యాపకులు అడబాల ఈశ్వరరావు, కోడూరి వెంకటేష్, కడలి మురళి శ్రీనివాస్, పొన్నమండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
