గర్భిణీని కడతేర్చిన భర్త జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలి : మహిళా సమాఖ్య

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : మధురవాడకు చెందిన నిండు గర్భిణీ అనూష ను కడతేర్చిన భర్త జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని, ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అత్తిలి విమల డిమాండ్‌ చేశారు. నిండు గర్భిణిని కడతేర్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కెజిహెచ్‌ మార్చురీ వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … విశాఖ నగరంలో ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పటికీ రాష్ట్ర హోం మంత్రి స్పందించకపోవడం దారుణం అన్నారు. హోం మంత్రి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, కార్యదర్శి ఎం.డి బేగం తదితరులు పాల్గొన్నారు.

➡️